తెలంగాణBreaking Newsహైదరాబాద్

Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!

Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నది.

ఈనెల 30వ తేదీ నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే కొత్త రేషన్ కార్డులకు క్యూఆర్ కోడ్, చిప్ ఉంటుందనే ప్రచారాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఖండించారు. కొత్త రేషన్ కార్డులలో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని చిప్ ఉండదని స్పష్టం చేశారు.

ఈనెల 30వ తేదీన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని హుజూర్‌నగర్ నుంచి ప్రారంభించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 89 లక్షల 793, 78 రేషన్ కార్డులు ఉండగా గత పది ఏళ్ల లో 49,479 కొత్త కార్డులు ఇచ్చారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు 2. 85 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు.

కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ తో పాటు పప్పులు, ఉప్పు తోపాటు నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

MOST READ : 

  1. TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  3. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

  4. Mutual Funds : మహిళల ఘనత.. ప్రతి నలుగురిలో ముగ్గురు వారే..!

మరిన్ని వార్తలు