Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
చెట్టుకు బైక్ ఢీకొని వ్యక్తి మృతి..!

చెట్టుకు బైక్ ఢీకొని వ్యక్తి మృతి..!
గుర్రంపోడు, మనసాక్షి:
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జూనుతల స్టేజి దగ్గర రహదారిపై బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఆడెపు వెంకటయ్య(55) బైక్పై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న ప్రభావంతో తీవ్ర గాయాలు కావడంతో వెంకటయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి దేవరకొండ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు.
MOST READ :
-
District collector : అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం.. బాల్య వివాహాలు లేని గ్రామాలుగా మార్చాలి..!
-
District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!
-
District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. తీగల వంతెన, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలి..!
-
State Level Badminton : రాష్ట్రస్థాయి బాడ్మింటన్ పోటీలకు శరణ్య ఎంపిక..!









