District collector : అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం.. బాల్య వివాహాలు లేని గ్రామాలుగా మార్చాలి..!

District collector : అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం.. బాల్య వివాహాలు లేని గ్రామాలుగా మార్చాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలోని గ్రామాలను బాల్య వివాహా రహితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, అన్ని లైన్ శాఖలతో కన్వర్జెన్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రెవిన్యూ, పంచాయతీ రాజ్, పోలీసు శాఖతో పాటు
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసిడిఎస్, ఐసిపిఎస్, డిహెచ్ఈడబ్ల్యూ, చైల్డ్ హెల్ప్ లైన్ విభాగాల ఉద్యోగులు సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. గతేడాది జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద ధన్వాడ, మరికల్, ఊట్కూర్, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల్లో నమోదైన బాల్య వివాహాల కేసుల వివరాలను ఆయా మండలాల అంగన్ వాడీ సూపర్ వైజర్ల ను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఆయా కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒకరిద్దరు సూపర్ వైజర్లు తమ పరిధిలో నమోదైన కేసుల వివరాలను పూర్తిగా చెప్పక పోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు వచ్చేటప్పుడు అన్ని వివరాలతో రావాలని, ఏదో కాలక్షేపానికి వచ్చినట్టు వస్తే ఎలా అని నిలదీశారు. కొన్ని మండలాలలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయక పోవడం పై ఆయా పోలీసు అధికారులను కలెక్టర్ వివరణ కోరారు.
సూపర్ వైజర్లు సరైన సమాచారం ఇవ్వకుండా, సరైన పేర్లు రాయకుండా ఫిర్యాదు చేస్తున్నారని, అన్ని వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచిస్తే మళ్ళీ పోలీసు స్టేషన్ కు రావడం లేదని ఒకరిద్దరు పోలీసు అధికారులు కలెక్టర్ కు తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని, ఏదో ఒక శాఖ అధికారులు పని చేస్తే సరిపోదని, లైన్ డిఫార్ట్ మెంట్ అధికారులందరూ కలిసి పని చేస్తేనే సాధ్యం అవుతుందని ఆమె సూచించారు.
బాల్య వివాహాల పై మండల స్థాయిలో పోలీసు అధికారులకు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు జిల్లా కేంద్రంలో ఉండే డీఎస్పీ దృష్టికి తీసుకు రావాలని కలెక్టర్ సూపర్ వైజర్ల కు సూచించారు. కాగా అంతకు ముందు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ మాట్లాడుతూ గ్రామ, మండల సాయి కమిటీలు తమ తమ పరిధిలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు.
ఈ నెల 27 నుంచి 30 వరకు అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి సమావేశాలు ఏర్పాటుచేసి ఆయా సమావేశాల్లో పూజారులు, సప్లయర్స్, ఫంక్షన్ హాల్ యజమానులు, ఫోటో గ్రాఫర్ లు, సౌండ్ సిస్టమ్ వాళ్ళను పాల్గొనేలా చేయాలన్నారు. బాల్య వివాహాలను చేసినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయా సమావేశాల్లో వారికి తెలియజేయాలని ఆయన చెప్పారు.
అలాగే ఈ నెల 28 నుంచి 30 వరకు అన్ని గ్రామాలలో గ్రామ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. డీ డబ్ల్యూ ఓ శాఖ తరపున విసృతంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో గుర్తించిన కొన్ని హాట్ స్పాట్ ల పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
సమావేశంలో డిఏస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు స్టేషన్ ల వారీగా గత 2023 నుంచి 2025 వరకు నమోదైన బాల్య వివాహాల కేసుల వివరాలు, వాటి పురోగతిని క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, ఆర్డీఓ రామచంద్రనాయక్,డిసిపివో కరిష్మా, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీలు, అంగన్ వాడీ సూపర్ వైజర్లు,, ఐసిపిఎస్, చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Hello Srinivas : హలో శ్రీనివాస్.. విశిష్టమైన ఐక్యత.. 26న శ్రీనివాస్ పేరు గల వ్యక్తుల ఆత్మీయ సమ్మేళనం..!
-
District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!
-
PDS : అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. మహిళ అరెస్ట్, 20 క్వింటాళ్లు స్వాధీనం..!
-
PDS : అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. మహిళ అరెస్ట్, 20 క్వింటాళ్లు స్వాధీనం..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!









