Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

PDS : అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. మహిళ అరెస్ట్, 20 క్వింటాళ్లు స్వాధీనం..!

PDS : అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. మహిళ అరెస్ట్, 20 క్వింటాళ్లు స్వాధీనం..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో 20 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక మహిళను దేవరకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బియ్యాన్ని తరలించడానికి ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
​దేవరకొండ సీఐ పి.వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

గురువారం ఉదయం  ఎస్సై వి.నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు ఎం.శివ (పీసీ5114), రాజకుమార్ (పీసీ5139)తో కూడిన పెట్రోలింగ్ బృందం దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామం నుండి దేవరకొండ వైపు వస్తున్న టాటా ఏసీ వాహనం నెం. టీఎస్ 31 టీ 0193 ను ఆపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా నిల్వ చేసిన ప్రజాపంపిణీ బియ్యం 50 బస్తాలు లభించాయి.

ఒక్కొక్క బస్తాలో సుమారు 40 కేజీల బియ్యం ఉండగా మొత్తం 20 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం, బియ్యం యజమాని వివరాలు ఆరా తీయగా ఆమె చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామానికి చెందిన షైక్ మురియాభీ (45) భర్త జానీమియా గా గుర్తించారు.

ఆమె గ్రామ ప్రజల వద్ద నుంచి తక్కువ ధరకు ఈ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్మడానికి నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ బియ్యాన్ని అక్కడ నాయిని సంపతయ్య అనే వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ​ఈ అక్రమ రవాణాపై దేవరకొండ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.వెంకట్ రెడ్డి వెల్లడించారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!

  2. Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!

  3. TG News : టోల్ ప్లాజా వద్ద అర్దరాత్రి కారు పల్టీ.. తనిఖీ చేయగా షాక్ తిన్న పోలీసులు..!

  4. Sand Transport : అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత..!

మరిన్ని వార్తలు