Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : ఉదయ సముద్రంలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..!

Nalgonda : ఉదయ సముద్రంలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ పట్టణ సమీపంలోని పానగలు ఉదయ సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతయి మరణించినట్లు వన్ టౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం..

మాడుగుల పెళ్లి మండలం గజలాపురం గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు పెద్ద దేవులపల్లి మత్స్య పారిశ్రామికక సహకార సంఘం సభ్యుడైన సింగం యాదగిరి ప్రస్తుతం నల్లగొండలోని బిటిఎస్ లో నివాసం ఉంటున్నాడు.

ఇతను శనివారం నాడు తన కొడుకు సింగం వరుణ్ తో కలిసి పానగలు ఉదయ సముద్రం కట్ట వద్దకు వెళ్లి కట్టపై తన కొడుకు వరుణ్ తేజ్ను కూర్చోబెట్టి చాపలు పట్టుటకు వల తీసుకొని చెరువులో తెప్పపై ఉదయ సముద్రంలోకి వెళ్ళగా ఒక్కసారిగా వాతావరణం మబ్బులు కమ్మి బలమైన ఈదురు గాలులు వీచి వర్షం కురుస్తుండగా గాలికి సింగం యాదగిరి చెప్ప ప్రమాదవశాత్తు తలకిందులై తిరగబడి చెరువులో మునగడం వలన గల్లంతై నీటిలో పడిపోయాడు.

చుట్టుపక్కల ఉన్న ఎంత వెతికినా దొరకకపోవడంతో ద పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు జాలర్లు అని పెట్టి వెతికించారు ఆదివారం సింగం యాదగిరి శవం పోలీసులు కనుక్కొని శవాన్ని బయటకు తీశారు. భార్య సింగం సత్యవతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Urea : యూరియా కోసం సొసైటీ కార్యాలయం వద్ద క్యూలో వందలాది మంది రైతులు..!

  2. Nizamabad : భారీ వర్షాలకు అధికారులు సూచనలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..!

మరిన్ని వార్తలు