Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సతీష్ కుమార్ ఎన్నిక..!

నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ సతీష్ కుమార్ ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఆయన దర్శనం నరసింహపై 181ఓట్ల తో గెలుపొందారు.

Nalgonda : బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సతీష్ కుమార్ ఎన్నిక..!

నల్గొండ, మన సాక్షి :

నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ సతీష్ కుమార్ ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఆయన దర్శనం నరసింహపై 181ఓట్ల తో గెలుపొందారు.

అదేవిధంగా ఉపాధ్యక్షులుగా పజ్జురుస్వామి గౌడ్, ఏ సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శిగా బచ్చనబోయిన అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీగా సూర్య పెళ్లి అమరావతి, కోశాధికారిగా ఎండి ఫిరోజ్, క్రీడా కార్యదర్శిగా నారా బోయిన ప్రసన్నకుమార్, లైబ్రరీ సెక్రటరీగా పూల పోయిన రామకృష్ణ, లు ఎన్నికయ్యారు. వీరితోపాటు కార్యవర్గ సభ్యులుగా మిరియాల భాగ్యమ్మ, దువ్వ గీత, పులిజాల కార్తీక్, కే నగేష్ కుమార్, మేడి ప్రగతి, జై రాములు, పందుల సైదులు, జి వెంకట్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికలకు ఎన్నికల అధికారిగా సయ్యద్ జమాల్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా బి రవి ఏ వెంకటరెడ్డి లు వ్యవహరించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో తన గెలుపు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు