Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్

Nizamabad : భారీ వర్షాలకు అధికారులు సూచనలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..!

Nizamabad : భారీ వర్షాలకు అధికారులు సూచనలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..!

భీంగల్, మన సాక్షి :

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లో భారీ వర్షం కురుస్తుంది. వాయుగుండం ప్రభావంతో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాలనీల్లోని రోడ్లు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వరద ప్రభావంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నైరుతి రుతుపవనాల్ని ఆహ్వానించేలా వాతావరణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకూ ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయి.. భారీగా కురిసిన వర్షనికి భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలో ఉన్నటువంటి సింగిడి చెరువు, పెద్ద చెరువుల అలుగుపై నుండి పొంగిపోర్లుతున్న వరద నీరు ఆనందంలో రైతన్నలు.. వరదలు ఉదృతంగా ప్రవహిస్తున్న వేల ఎవరు కూడా చేపల వేటకు ప్రాజెక్టులు, చెరువులు, నదులలో వెళ్లకుండా కట్టడి చేయాలని అధికారులు తెలియజేశారు.

శనివారం, ఆదివారం సెలవు దినమైనందున విద్యార్థులు, యువకులు ఈత సరదా కోసం చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా నిలువరించాలని అధికారులు సూచించారు. రానున్న గంటలలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జరిచేసింది.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడ తొలి ఎంపీపీ, తొలి సర్పంచ్.. కన్నెగంటి రంగయ్య మృతి.. నేడు అంతక్రియలు..!

  2. Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)

  3. Karimnagar : నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. అభినందించిన సీపీ..!

  4. Nalgonda : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. స్తంభించిన రోడ్లు..!

మరిన్ని వార్తలు