క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి..!

Miryalaguda : చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

చేపలు పట్టడానికి వెళ్లి వ్పక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మీనారాయణ (48) గ్రామస్తులతో కలిసి చిల్లాపురం గ్రామ శివారులోని చెరువు వద్ద చేపలు పట్టడానికి ఉదయం వెళ్ళాడు. ఇంటికి వచ్చి తిరిగి మధ్యాహ్నం చేపలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు.

ఆ క్రమంలో చిల్లాపురం గ్రామ శివారులోని జానపాటి సైదులు వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ మోటార్ స్టార్టర్ కు ఉన్న వైరు ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయమై మృతుని కుమారుడు బొడ్డుపల్లి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

MOST READ : 

  1. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!

  2. IPL 2025 : 14 ఏళ్లకే ఐపీఎల్ లో చోటు.. ఫస్ట్ బంతికే..!

  3. Additional Collector : ధాన్యం తూకంలో తేడా వస్తే చర్యలు.. రైస్ మిల్లులు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్..!

  4. Kusthi : బస్తీ మే సవాల్‌.. అట్టహాసంగా కుస్తీ పోటీలు..!

  5. Miryalaguda : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు..!

మరిన్ని వార్తలు