Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో హోరెత్తిన ఎద్దుల పోటీలు..!

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలోని బావి గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి ఎద్దుల పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.

Nalgonda : నల్గొండ జిల్లాలో హోరెత్తిన ఎద్దుల పోటీలు..!

గుర్రంపోడు, మన సాక్షి:

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలోని బావి గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి ఎద్దుల పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ చెవ్వు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు గ్రామస్తులను, క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి,రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పాశం గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదిక వద్దకు చేరుకున్న అతిథులకు సర్పంచ్ చెవ్వు రమేష్, గ్రామ పెద్దలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కున్నూరు సైదిరెడ్డి, కేసాని సుధాకర్ రెడ్డి, కుంభం ప్రశాంత్ రెడ్డి, బొల్లారం మాజీ సర్పంచ్ నరసింహ, బుడ్డారెడ్డి గూడెం సర్పంచ్ బాలకృష్ణ, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇటికాల శివ, ఉప సర్పంచ్ మంటిపల్లి రేణుక, వార్డు మెంబర్లు మట్టిపల్లి నగేష్, మంటిపల్లి కోటేష్, మేకల సతీష్, చామలోని బావి యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన ఎద్దుల పోటీలు ప్రేక్షకులను కట్టుపడేశాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మేలురకపు గిత్తలు తమ బలాన్ని ప్రదర్శించి అలరించాయి. పోటీల అనంతరం భక్తులందరికీ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో, క్రీడా ఉత్సాహంతో చామలోని బావి గ్రామం పండుగ శోభతో కళకళలాడింది.

మరిన్ని వార్తలు