Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!

Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది.వినాయకుని ముందు డాన్స్ చేస్తూ బురుడు వాడికి చెందిన శేఖర్ (45) కుప్పకూలి పడిపోయి మరణించాడు.
మున్సిపాలిటీ లో వాటర్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ కార్మికుడుగా పనిచేస్తున్న శేఖర్ మృతి చెంది ఉత్సవంలో విషాదం నింపాడు.
ఏరియా ఆసుపత్రి ముందు గణేష్ డీజే ముందు డాన్స్ ఆడుతూ కిందపడి అపస్మారక స్థితి లో పడడం తో హుటాహుటిన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ రెడ్డి సహాయంతో సిపిఆర్ నిర్వహించినా ఫలితం లేకపోయింది.
వెంటనే ఆటోలో వేసుకొని పాత బస్టాండ్ దగ్గర ఉన్న యశోద హాస్పిటల్ ముందు హుటాహుటిన డాక్టర్ తో చికిత్స చేసిన లాభం లేకపోయింది.శేఖర్ అప్పటికే వ్యక్తి మృతి చెందాడని డాక్టర్ తెలిపారు.శవాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
బిజెపి నేతల పరమార్ష ::
మున్సిపల్ కార్మికుడు శేఖర్ కుప్పకూలి మృతి చెందిన విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రతంగ్ పాండు రెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకుని భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలి పారు.శేఖర్ కుటుంబ సభ్యు లను ఓదార్చి పరామర్శించారు.









