BREAKING : నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో తృటిలో తప్పిన ప్రమాదం..!
BREAKING : నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో తృటిలో తప్పిన ప్రమాదం..!
నేలకొండపల్లి, మన సాక్షి:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయం లో తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రైతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లో నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. తహశీల్దార్ చాంబర్ లో ఉన్న ధరణి డేటా ఎంట్రీ ఆపరేటర్ కౌశిక్ రైతుల పోటోలను దింపే పని లో ఉన్నారు.
ఒక్కసారిగా స్లాబ్ పడటంతో అక్కడ ఉన్న రైతులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. రెప్పపాటు లో, డేటా ఎంట్రీ ఆపరేటర్ కౌశిక్ తప్పించుకున్నారు. ప్రమాదం జరగటంతో ఎం జరుగుతుందోనని రైతులు భయంతో పరుగులు తీశారు. తహశీల్దార్ -గౌరి శంకర్, సిబ్బంది అప్రమతమయ్యారు. ప్రమాదంలో ఎవరికి ఏమీ జరగకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
భవనం శిధిలావస్థలో ఉండటంతో భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం నుంచి తప్పించుకున్న నేలకొండపల్లి సోసైటీ డైరెక్టర్ కనకబండి కనకరాజు మాట్లాడారు….రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫోటో దిగి నిలుచున్న క్షణంలోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. అధికారులు స్పందించి తహశీల్దార్ కార్యాలయం కు నూతన భవనం ను నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
BREAKING : PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!
బిగ్ బ్రేకింగ్ : TSPSC గ్రూప్ 2 పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
BREAKING : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్.. షెడ్యూల్ ఖరారు..!









