Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

Alumni : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!

Alumni : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతీ విద్యా నిలయంలో 2007-08 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను ఆదివారం ఆ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులంతా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నాటి తమ గురువులను ఘనంగా సన్మానించారు.నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యతోటే అభివృద్ధి సాధ్యమని అన్నారు.తమ విద్యార్థులు నేడు వివిధ ఉన్నత స్థాయిలలో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం విద్యార్థులు ఒకొక్కరుగా మాట్లాడి పాఠశాల జ్ఞాపకాలు, ప్రస్తుతం తమ స్థితిగతులను తెలిపి ఆనందంగా గడిపారు.కష్టాల్లో ఉన్న మిత్రులను ఆదుకోవాలని, తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి సహకరిస్తామని తెలిపారు.

నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో నేడు తాము వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాటి హెడ్మాస్టర్ నరసింహమూర్తి, కరస్పాండెంట్ యానాల వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మికాంత రెడ్డి, మురళీకృష్ణ, ఎల్లారెడ్డి, సోమయ్య, లచ్చిరెడ్డి, శేఖర్ రెడ్డి, బ్రహ్మయ్య, పద్మావతి, విక్రమ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, భాను, జగన్మోహిని, వెంకన్న, సైదులు, సిబ్బంది గీత, సీతారాములు, నాటి విద్యార్థులు పాల్గొన్నారు.

MOST READ :

  1. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  2. VISA : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాక్.. యూఎస్ వీసా మరింత కఠినం..!

  3. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

  4. Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!

మరిన్ని వార్తలు