Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)
Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంగళవారం విడుదల చేశారు. ఫలితాల నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఫలితాలు సాధించి సంతోషాలు జరుపుకుంటున్నా.. మరి కొంతమంది విద్యార్థులు పరీక్షలు తప్పారు.
రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ లో 66.89% ఉత్తీర్ణత సాధించగా సెకండియర్ లో 71.37% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కళాశాలలో సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఓ విద్యార్థిని వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమెకు ఇంటర్ లో 440 మార్కులకు గాను 434 మార్కులు తెచ్చుకుని టాపర్ గా నిలిచింది. స్టేట్ లెవెల్ లోనే టాప్ గా నిలిచింది. అయితే ఆ విద్యార్థిని 434 మార్కులు వచ్చినా కూడా బోరున విలపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఆమె ఇంటర్ ఫెయిల్ కాలేదు.
అయినా కూడా ఆమెకు 6 మార్కులు తక్కువగా వచ్చాయని అన్నం తినకుండా ఏడుస్తుంది. ఆ విద్యార్థిని తల్లి ఊరుకోమని వారించినప్పటికీ కూడా ఏడుస్తూనే ఉంది. ఈ వీడియో సోషల్ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాల సెటైర్లు వేస్తున్నారు.
వీడియో చూడండి
MANGAPATHI KUTURU ANUKUNTA👀 434/440🌝👏
Naku anni marks vaste ma nanna DJ
Pettistadu..🤣😂🕺💃 pic.twitter.com/Ts3xpD2P1a— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) April 22, 2025
MOST READ :
-
Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్..!
-
Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థుల ప్రభంజనం..!
-
Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!
-
Health : మీ జుట్టు నల్లబడాలా.. చాలా సింపుల్.. ఈ నీళ్లు దివ్యౌషధం..!
-
District collector : భూ భారతి తో రైతులందరికి వన్ బి.. కలెక్టర్ వెల్లడి..!









