District collector : సంక్షేమ పథకాల అధ్యయనంకు సివిల్ సర్వీస్ ప్రొబెషనరీ అధికారుల బృందం..!
District collector : సంక్షేమ పథకాల అధ్యయనంకు సివిల్ సర్వీస్ ప్రొబెషనరీ అధికారుల బృందం..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అధ్యయనం నిమిత్తం సివిల్ సర్వీసెస్ ప్రొబిషనరీ అధికారుల బృందం జిల్లాలో వారం రోజులపాటు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం జిల్లా పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు పై ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో టెలికాన్స్ నిర్వహించారు.
ఈ నెల 21 నుండి 28 వరకు 8 రోజులపాటు జిల్లాలోని పీఏ పల్లి మండలం రంగారెడ్డిగూడెం, చింతపల్లి మండలం జర్పులతండా, దేవరకొండ మండలం కర్నాటి పల్లి, కొండమల్లేపల్లి మండలం ఇస్లావత్ తాండ, పెండ్లిపాకల గ్రామాలలో ఈ అధికారుల బృందం పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయం చేయనున్నట్లు తెలిపారు.
ఈ బృందంలో 21 మంది అధికారులు ఉన్నారని, డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవనుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు రానున్నారని కలెక్టర్ చెప్పారు. . ఒక్కో గ్రామానికి ఐదు మంది చొప్పున కేటాయించడం జరిగిందని, సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం అధ్యయనానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి ఆయా గ్రామాల ప్రొఫైల్ తో పాటు, గ్రామాలలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తయారు చేయాలని, అన్ని విషయాలపై వారికి తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.
సివిల్ సర్వీస్ ప్రొబేషనరీ అధికారుల బృందం 21 నుండి 24 నుండి వారికి కేటాయించిన గ్రామాలలోనే బసచేస్తారని,25 న అదే మండలం మేజర్ గ్రామపంచాయతీలో అధ్యయనం చేస్తారని, 26 ,27 తేదీలలో దేవరకొండ, నాగార్జునసాగర్ మున్సిపాలిటీలలో అధ్యయనం చేస్తారని తెలిపారు. అందువలన వారికి అవసరమైన వసతి, భోజనం, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు, పాట్లు లేకుండా చూసుకోవాలని అన్నారు.
28 న జిల్లా కేంద్రానికి వచ్చి తనతో సమావేశం అవుతారని , ఈ బృందానికి నోడల్ అధికారులుగా జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ మరియు డి ఆర్ డి ఓ ఉంటారని, ఆర్డీవోలు, సంబంధిత మండలాల ఎంపీడీవోలు, తహసిల్దారులు, అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర, జిల్లా అధికారులు, ఆర్డీవోలు , మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తదితరులు ఈ టెలి కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
MOST READ:
-
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)
-
Video : చీ చీ అంత దారుణమా.. పనిమనిషి వంట గదిలో.. (వీడియో)
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
-
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)









