Nizamabad : ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన యువకుడు..!

Nizamabad : ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన యువకుడు..!
ఆర్మూర్, మన సాక్షి
హారన్ కొట్టినందుకు ఆర్టీసీ బస్సుపై దాడి చేయడంతో పాటు ప్రయాణికులను అసభ్య పదజాలంతో దూషణలకు దిగడంతో తీవ్రంగా బెదిరించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆలూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం రాత్రి 8:30 సమయంలో ప్రధాన రహదారిపై బస్సుపై దాడి చేసిన అనంతరం, అక్కడ చేరి ఈ ఘటనను రికార్డు చేస్తున్న మీడియా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆయన అనుచిత పదాలు ఉపయోగిస్తూ అవమానపరచినట్లు మీడియా ప్రతినిధులు తెలిపారు.
అంతేకాక, మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి, మరింత తీవ్రంగా ధమ్కీలు ఇవ్వడం వల్ల భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనపై మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. సంబంధిత అధికారులను ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. మీడియా ప్రతినిధుల వద్ద ఆడియో ఆధారాలు ఆర్మూర్ ఎస్సై రమేష్ కు వినిపించడం జరిగిందని పేర్కొన్నారు.
హారన్ కొట్టాడని ఆర్టీసీ బస్సుపై దాడి pic.twitter.com/avFCfqBfvW
— Mana Sakshi (@ManaSakshiNews) October 10, 2025
MOST READ :









