Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Heavy Rain : అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి పంటలు.. అయోమయంలో రైతులు..!

Heavy Rain : అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి పంటలు.. అయోమయంలో రైతులు..!

గుర్రంపోడు, మన సాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలో అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగి, అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు కోత దశలో ఉన్నప్పుడు వర్షాలు కురవడం వల్ల, పంట నూర్పిడికి సిద్ధంగా ఉన్న వరి చేలు ఒరిగిపోయి, వడ్లు రాలిపోతున్నాయని, రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

భారీ వర్షాల వల్ల పత్తి పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది, కోత సమయానికి వర్షం వస్తే పత్తి కాయలు తడిసి, రంగు మారి, కుళ్ళిపోతాయి. దిగుబడి తగ్గి, పత్తి నాణ్యతను దెబ్బతీసి, పంట మొత్తం నాశనం అయ్యేలా చేస్తుంది, రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఎంతో శ్రమించి, పెట్టుబడులు పెట్టినా వర్షాల కారణంగా పంట నష్టపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకపక్క యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు యూరియా కోసం సరఫరా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నారు, ప్రభుత్వం సమన్వయ లోపంతో వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

MOST READ : 

  1. Rusal : అల్యూమినియం స్క్రాప్ శుద్ధిలో రూసల్ విప్లవాత్మక పురోగతి..!

  2. Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!

  3. Paddy : వరిలో దోమపోటు నివారణకు చర్యలు.. ఏ మందు పిచికారి చేయాలి..!

  4. Nalgonda : జిల్లా వ్యవసాయాదికారి రైతులకు కీలక సూచన.. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..! 

మరిన్ని వార్తలు