Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!

Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అధిక రుసుము వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో దేవరకొండలోని పలు ఆధార్ నమోదు కేంద్రాలు వివాదాస్పదంగా మారాయి. ఆధార్ సేవలు నామమాత్రపు రుసుముతో అందించాల్సి ఉండగా కొన్ని కేంద్రాలు కొత్త ఆధార్ కార్డుల నమోదు చిరునామా మార్పులు పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ సవరణలు వంటి సేవలకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
అక్రమాలకు అడ్డాలుగా మారిన కేంద్రాలు
స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని ఆధార్ కేంద్రాల్లో ఏజెంట్లు మధ్యవర్తులు చురుగ్గా పనిచేస్తున్నారు. వీరు సాధారణంగా ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఐదు నుండి పది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఆధార్‌లో చిరునామా మార్పుకు రూ.50 మాత్రమే రుసుముగా ఉండగా కొన్ని కేంద్రాలు రూ.200 నుండి రూ.500 వరకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అక్రమాలకు డబ్బులు చెల్లించలేని పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజల ఆవేదన
దేవరకొండ పట్టణానికి చెందిన మొహమ్మద్ పాషా ఆధార్ కార్డులో ఫోన్ నంబరు మార్పు కోసం సోమవారం ఆధార్ సెంటర్ కు వెళ్తే, రూ.200 అడిగారుఅని అన్నారు. ప్రభుత్వం కేవలం రూ.50 మాత్రమే ఉంటుందని చెప్పినా వారు పట్టించుకోలేదు. స్థానిక యూనియన్ బ్యాంక్ ఆధార్ సెంటర్లో ఈ ఘటన జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీతో వృద్ధులు, కూలీలు, నిరక్షరాస్యులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ కేంద్రాల నిర్వాహకులు, మధ్యవర్తుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
అధికారులు ఈ దోపిడీని ఎందుకు పట్టించుకోవడం లేదు? వారి సహకారంతోనే ఈ దోపిడీ జరుగుతుందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆందోళన దృష్ట్యా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే ఈ అక్రమ వసూళ్లను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన కేంద్రాలపై కఠినమైన జరిమానాలు విధించడం లేదా వాటి లైసెన్సులు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి ఆధార్ సేవలు పారదర్శకంగా నిబంధనల ప్రకారం అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
MOST READ :
-
Additional Collector : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా అప్పుడే.. అదనపు కలెక్టర్ వెల్లడి..!
-
District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!
-
Karimnagar : వైద్యం కోసం వెళ్తే.. మత్తు ఇచ్చి యువతీపై అఘాయత్నం..!
-
Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!
-
Yadadri : తాటి చెట్టుపై ప్రమాదం.. ప్రాణాలు తెగించి, గంటన్నర కష్టపడి కాపాడిన తోటి గౌడన్నలు..!









