Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Additional Collector : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా అప్పుడే.. అదనపు కలెక్టర్ వెల్లడి..!

Additional Collector : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా అప్పుడే.. అదనపు కలెక్టర్ వెల్లడి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఎస్ శ్రీను తెలిపారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందని అన్నారు.

ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10వ తుది జాబితా వెలువరిస్తామని సూచించారు.

మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో డిఆర్డిఓ మొగులప్ప, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సలీం, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు సాయిబన్న, బి ఆర్ ఎస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, సిపిఎం నాయకులు వెంకట్రాంరెడ్డి, డి.ఎస్.పి నాయకులు బొదిగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!

  2. Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!

  3. Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!

  4. Drinking Water : ఖాళీ బిందెలతో త్రాగినీటి కోసం మహిళలు పంచాయతీ కార్యాలయం ముట్టడి..!

మరిన్ని వార్తలు