BREAKING : కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదం.. ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని..!
BREAKING : కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదం.. ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని..!
నేలకొండపల్లి, మన సాక్షి :
జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురుకు తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని తిరుమలాపురం సమీపంలోని కోదాడ-ఖమ్మం జాతీయ రహదారి పై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
ఎదురెదురుగా వస్తున్న కార్లు రెండు డీకొన్నాయి. దీంతో కార్లు లో ప్రయాణిస్తున్న ఏడుగురు కు తీవ్రగాయాలయ్యాయి. వైరా కు చెందిన వారు పని నిమ్మిత్తం సూర్యాపేట జిల్లా, కోదాడ వెళ్లి కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో ఖమ్మం నుంచి కోదాడ వెళ్తున్న కారు రెండు తిరుమలాపురం సమీపంలో రెండు డీన్నాయి.
దీంతో అందులో ప్రయాణిస్తున్న పార్వతి (65), భాగ్యమ్మ -(55), షేక్ సలీమ్ (60), పి.హస్సేన్ (60) లకు తీవ్ర గాయాలైయ్యాయి. కార్లు బలంగా డీకొనటంతో కాళ్లు, చేతులు విరిగాయి. వీరిని 108 ద్వారా ఖమ్మం తరలించారు.
అదే విధంగా గాయపడ్డ మరో ముగ్గురు ప్రత్యేక వాహానంలో ఖమ్మం తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జుగా మారాయి. క్షతగాత్రులను ప్రయాణికులు కారులో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాద సమయంలో ఖమ్మం-కోదాడ రహదారి పై భారీగా వాహానాలు నిలిచిపోయాయి.
LATEST NEWS :
Viral video : లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు.. సిసి టీవీ రికార్డు వైరల్..!
Grama Panchayathi : గ్రామపంచాయతీ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. మంత్రి పొన్నం వెల్లడి..!









