రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – latest news

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పెన్ పహాడ్, ఆగస్ట్ 24, మనసాక్షీ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్న సంఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహడ్ మండల పరిధిలోని తంగేళ్లగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాచకొండ రమణ(35) తన భర్త ఉపేందర్ తో కలిసి ద్విచక్ర వాహనంపై సూర్యాపేట రూరల్ మండలం బాలెంల బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో మునగాల గ్రామం దాటిన తర్వాత ఆయిల్ ఫామ్ తోట వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనానికి గేదె అకస్మాత్తుగా అడ్డు రావడంతో ద్విచక్ర వాహనంపై నుండి పడగా తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

కాగా మృతురాలుకు కుమారుడు, కుమారై ఉన్నారు వారిరోధనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువుల పిర్యాదు మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.