లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు మృతి

లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు మృతి

అర్వపల్లి, జులై 12, మన సాక్షి : అర్వపల్లి మండల కేంద్రంలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు అర్వపల్లి సీతారామచార్యులు (75) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఎంతో చరిత్ర కలిగిన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రధాన అర్చకులుగా 60 సంవత్సరాల పైబడి పూజారిగా విధులు నిర్వహించి ఈరోజు శివైక్యం పొందారు. సీతారామాచార్యులకు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

ALSO READ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

జెడ్పిటిసి దావుల వీరప్రసాద్ యాదవ్ సర్పంచ్ బైరబోయిన సునీత రామలింగయ్య ఎంపీటీసీ కణుకు పద్మ శ్రీనివాస్ దేవస్థాన చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్ మాజీ చైర్మన్ భైరమైన సైదులు నిమ్మల సోమయ్య దేవస్థానం ఈవో శ్రీనివాస్ రెడ్డి గ్రామ నాయకులు . అర్చకులు బ్రాహ్మణులు రైతులు పార్థివదేహం పై పుష్ప గుచ్చలు ఉంచి నివాళులర్పించారు