Agricultural Tools : సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు.. దరఖాస్తు ఆహ్వానం..!
Agricultural Tools : సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు.. దరఖాస్తు ఆహ్వానం..!
కంగ్టి, మన సాక్షి :
సబ్సిడీపై వ్యవసాయ పరికరాలకు దరఖాస్తు చేసుకోవాలని ఏవో హరీష్ పవర్ కోరారు. మంగళవారం కంగ్టి మండల వ్యవసాయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. 2025 సంవత్సరానికి రైతులకు అందించే వ్యవసాయ పరికరాలకు రైతుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ ల రైతులకు 50 శాతం సబ్సిడీతో, ఇతర రైతులకు 40 శాతం సభ్యుడిపై వ్యవసాయ పరికరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
మండలానికి కేటాయించిన వ్యవసాయ పరికరాలు
1. 461 బ్యాటరీ స్ప్రయెర్లు
2. 61పవర్ స్ప్రేయర్లు,పంపులు
3. 22 రోటవేటర్లు
4. 6 సీడ్ కమ్ ఫెర్టీలేజెర్ డ్రిల్లులు
5. 38 డిస్క్ హ్యారో,కల్టివేటర్,ఎంబి ప్లొవ్,కేజీ వీల్
6. 7 పవర్ వీడర్లు
7. 2 బ్రష్ కటర్లు
8. 2 పవర్ టీల్లర్లు
9. 4 మొక్క జొన్న షెల్లెర్లు
10. 1 స్ట్రా బేలర్
ధరఖాస్తుకు కావాల్సిన ప్రతులు, ధరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, ట్రాక్టర్ సంబంధించిన పరికరాలకు ఆర్ సి జిరాక్స్, బ్యాంక్ పాస్ పుస్తకం, 2 పాస్ ఫోటోలు, నెల సారానికి సంబంచిందిన సాయిల్ హెల్త్ కార్డును తప్పనిసరిగా జతపరచి సంబంధిత రైతువేదిక లోని క్లస్టర్ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!
-
Narayanpet : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ..!
-
NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!
-
District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!









