District collector : రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలల్లో అన్నీ సమస్యలే.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!
District collector : రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలల్లో అన్నీ సమస్యలే.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!
కొండమల్లేపల్లి, మనసాక్షి :
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో పలు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శశుక్రవారం తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లిలోని పలు సంక్షేమ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ముందుగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించి అక్కడున్న విద్యార్థుల సంఖ్య , వసతులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అక్కడ అవసరమైన అదనపు మంచాలు, బాత్రూంలు, తాగునీటి వసతి, అదనపు తరగతి గదులు, డార్మేటరీ, తదితర వివరాలను కళాశాల ప్రిన్సిపల్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ శారదతో మౌలిక సదుపాయాల వివరాలను అడగగా , మంచాలు కావాలని, తాగునీటి సమస్య ఉందని, 30 అదనపు టాయిలెట్లు కావాలని, బాత్రూంలు కావాలని, అలాగే ఓహెచ్ఎస్ఆర్ కావాలని, మిషన్ భగీరథ సమస్య ఉందని అన్నారు.
ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ కళాశాలకు సంబంధించిన ప్రహరీ ఇంకా పూర్తి కాలేదా అని అడిగారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను సందర్శించి అక్కడ కూడా మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి , ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల రీజినల్ కో-ఆర్డినేటర్ బలరాం నాయక్, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!
-
Accident : ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని ముగ్గురు సజీవ దహనం..!
-
Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!
-
Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!









