Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!
మన సాక్షి, నాగార్జునసాగర్ :
రెండు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా నిలిచే నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు చేరుతుంది. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముందస్తుగానే వరద నీరు మొదలయ్యింది. నాగార్జునసాగర్ ఎగువ భాగంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పై ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే నిండుతున్నాయి.
దాంతో శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ కేంద్రం ప్రారంభించారు. శ్రీశైలం విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలైన నీరు 51, 373 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ కు చేరుతుంది. కాగా ప్రస్తుతం నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులకు గాను 520.10 అడుగుల మేర ఉంది. సాగర్ జలాశయ నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 149 టీఎంసీల నీరు ఉంది.
నాగార్జునసాగర్ జలాశయం కు ముందస్తుగానే నీరు చేరడంతో గత ఏడాది మాదిరిగానే ఆగస్టు మొదటి వారంలోనే సాగర్ ఎడమ కాలువలకు నీటి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు కూడా వరి నాట్లు వేసేందుకు దుక్కులు దున్నుకొని సిద్ధం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల వరి నారు కూడా పోసుకొని సిద్ధమయ్యారు.
MOST READ :
-
Nalgonda : ఎరువుల నిల్వల్లో తేడా వస్తే కఠిన చర్యలు.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు..!
-
Paddy Cultivation : వరి నాట్ల హడావిడి.. రైతులు బిజీ బిజీ..!
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!
-
Vi : కస్టమర్లకు ‘వీఐ’ శుభవార్త: రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ..!









