సినీ పక్కీలో చోరీకి యత్నం.. 60 ఏళ్ల వృద్ధురాలు దొంగలకు బడిత పూజ..!
సినీ పక్కీలో చోరీకి యత్నం.. 60 ఏళ్ల వృద్ధురాలు దొంగలకు బడిత పూజ..!
నేలకొండపల్లి, మన సాక్షి :
సినిమా పక్కీలో చోరికి యత్నించిన వారి కి బడితె పూజ చేయటంతో విఫలమైన ఘటన సినిమా పక్కీలో జరిగింది. అయిన వారి కూడ అంతా దర్పం చూపరు…దర్జాగా ఇంట్లో కి వచ్చి…మాటలు కలిపింది… ఇంకేముంది. తలుపు పెట్టి చోరీ కి పాల్పడేందుకు ప్రయత్నించింది. కానీ ఇంటి యజమాని వృద్ధురాలు దైర్యంతో తిరగబడటంతో చోరి కి యత్నించిన దొంగలు పరారైన ఘటన మండలం, లో చోటు చేసుకుంది. బాధితురాలి కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నేలకొండపల్లి మండలం లోని మోటాపురం గ్రామానికి ‘చెందిన రావెళ్ల దమయంతి (60) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. బుధవారం ఇంట్లో టీవీ చూస్తుండుగా, ఇద్దరు మహిళలలో ఒకరు నేరుగా ఇంట్లోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, బంధువుల మాధిరిగా బాగానే అని పలకరించింది. అవాక్కునా దమయంతి ఎవరూ మీరు అని ప్రశ్నించగా, టీవీ చూద్దమని వచ్చానని చెప్పి…తలుపు పెట్టి చోరీకి యత్నించింది.
దీంతో అగ్రహం కు గురైన వృద్ధురాలు ఇంట్లో మూలన ఉన్న కర్ర తీసుకుని ధైర్యంగా పోరాడింది. తిరగబడి బడిత పూజ చేసింది. దీంతో తట్టుకోలేక తలుపు తీసి బయటకు పరుగులుతీసింది. అప్పటికే ఇంటి ముందు ఉన్న మరో మహిళ ఇద్దరు రోడ్డు ఎక్కగానే ఓ వ్యక్తి వచ్చి బైక్ పై ఎక్కించుకుని అక్కడ నుంచి ముగ్గురు పరారైయ్యారు. అంతా సినిమా పక్కీలో జరిగింది. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా దుండగులకు బడితే పూజ చేసి ధైర్యంగా పోరాడిన వృద్ధురాలిని పలువురు అభినందించారు. గ్రామాలలో శివారులలో ఉన్న ఇళ్లు, ఒంటరిగా ఉన్న ఇళ్ల ను టార్గెట్ చేస్తున్నారని సమాచారం తెలియటంతో గ్రామాలలో ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి :
NALGONDA : మున్సిపాలిటీలలో 26 నుంచి ఇంటింటి సర్వే.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నల్గొండలో బ్రాండెడ్ వస్తువుల పేరుతో మోసం.. కాపీ రైట్స్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..!









