Anchor Ravi : కొండమల్లేపల్లి లో సందడి చేసిన యాంకర్ రవి..!

కొండమల్లేపల్లి పట్టణంలోని స్థానిక సాగర్ రోడ్డులో గల వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం, వాసవి వనిత క్లబ్ ల ఆధ్వర్యంలో ఆడవాళ్లు మీకు జోహార్లు అని కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

Anchor Ravi : కొండమల్లేపల్లి లో సందడి చేసిన యాంకర్ రవి..!

కొండమల్లేపల్లి, మన సాక్షి :

కొండమల్లేపల్లి పట్టణంలోని స్థానిక సాగర్ రోడ్డులో గల వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం, వాసవి వనిత క్లబ్ ల ఆధ్వర్యంలో ఆడవాళ్లు మీకు జోహార్లు అని కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మంది మహిళలు పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సందడి చేశారు.

అనంతరం ప్రతిభ చాటిన మహిళలకు టీవీ యాంకర్ రవి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ఊరె జనార్ధన్, బచ్చు వెంకటేశ్వర్లు గుమ్మడవెల్లి జనార్ధన్, గుమ్మడవెల్లి గీత, బండారు జయశ్రీ, గుమ్మడవెల్లి లావణ్య కామిశెట్టి ,భాగ్యలక్ష్మి , మాధవి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ  :