Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : సాగర్‌ ఎడమకాల్వలో అంగనవాడీ టీచర్‌ గల్లంతు.. ప్రాణాపాయ స్థితిలో బయటపడిన ఆమె భర్త..!

Miryalaguda : సాగర్‌ ఎడమకాల్వలో అంగనవాడీ టీచర్‌ గల్లంతు.. ప్రాణాపాయ స్థితిలో బయటపడిన ఆమె భర్త..!

వేములపల్లి, మన సాక్షి :

ద్విచక్ర వాహనం అదుపుతప్పి సాగర్‌ ఎడమకాల్వలో పడటంతో అంగనవాడీ టీచర్‌ గల్లంతు కాగా ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారు. ఈ సం ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం రావులపెంట గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కామేపల్లి గ్రామానికి చెందిన అంగనవాడీ టీచర్‌ ఇటీవల పదోన్నతిపై వెళ్లిపోయింది.

దీంతో ఆమనగ ల్లు గ్రామపంచాయతీ పరిధిలోని రావువారిగూడెంనకు చెందిన అంగనవాడీ టీచర్‌ పేరబోయిన అనూష (35)కు ఇనచార్జి బా ధ్యతలు అప్పగించారు. దీంతో శనివారం ఉదయం తన భర్త సైదులుతో కలిసి ద్విచక్ర వాహనంపై అనూష కామేపల్లి గ్రామానికి విధులపై బయలుదేరి వె ళ్లింది. సాయంత్రంత న భర్తతో పాటు ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వెళ్తుంది.

ఈ క్రమంలో రావులపెంట గ్రామ శివారులోని బ్రి డ్జి వద్ద ద్విచక్ర వాహ నం అదుపు తప్పి కాల్వలో దూసుకెళ్లింది. ఈ సంఘటనలో భర్త సైదులు ఈదుకుంటూ ప్రాణాపాయ స్థితిలో ఒడ్డుకు చేరగా అనూష, ద్విచక్రవాహనం కాల్వలో గల్లంతయ్యారు.

దీంతో సమాచారం అందుకున్న వేములపల్లి ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని కాల్వపై గల్లంతైన అనూష కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనూషకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు