అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ అలివేలు మంగ, పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం..!
కోరిన కోరికలు తీర్చే దైవంగా కొంగు బంగారమై చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామంలో కొండపై కొలువు దీరిన శ్రీశ్రీశ్రీ అలివేలుమంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వేలాది మంది భక్తుల నడుమ వేదమంత్రోచరణలతో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్నినిర్వహించారు.

చింతపల్లి, మన సాక్షి :

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఊరే లక్ష్మణ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, స్థానిక సర్పంచ్ కాశగోని వెంకటయ్య దంపతులు స్వామివారికి కళ్యాణ మహోత్సవ సందర్భంగా నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు వచ్చేసి స్వామివారి కల్యాణాన్ని క నులారా విందంగా తిలకించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద్,తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, వేద పండితులు గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.