Animals Love | మూగజీవాలపై అతి ప్రేమ.. ఆ రైతు ఏం చేశాడో తెలిస్తే…!

మూగజీవాలపై అతి ప్రేమ.. ఆ రైతు ఏం చేశాడో తెలిస్తే…!

చర్ల,  మనసాక్షి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ఓ గ్రామంలో మూగ జీవి పట్ల అపారమైన ప్రేమను చూపుతున్న రైతు. మూగ జీవి పట్ల అతను నడుచుకుంటున్న నడకను చూసి ఆ గ్రామ ప్రజలంతా ఆశ్చర్యనికి గురైయ్యారు.

 

ఇప్పుడున్న సమాజంలో పశువుల పట్ల మనుషులకు ఉన్న ప్రేమ ఎంతటిదంటె నాగటి ఎడ్లయితే దుక్కి దున్నామా పూట గడిపామా, పెరట్లో ఉన్నది అవులైతే పాలు పితికామా పూట గడిపామా అన్నట్లు పశువుల యాజమాన్లు వందకు వంద శాతం ఉన్నారు.

 

కానీ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామంలో ఓ మూగజీవి పట్ల అపారమైన ప్రేమను చూపుతూ అచ్చం మనుషులవలె మూడు నెలలకు ఒకసారి వాటికి జుట్టు కటింగ్ చేపించడంలో గాని పండగలు పబ్బాలు వచ్చినప్పుడు వాటికి బట్టలు కుట్టించడం లోగాని ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ ఎక్కడో పెరట్లో ధోమలలో చెత్తా చెదరంలో కట్టిపడేయ్యకుండా వాటి గురించి కొంత అమౌంట్ ఖర్చుపెట్టి రేకుల షెడ్డు ఏర్పరిచి వాటికి ఫెన్లు ఏర్పాటు చేయ్యడం జరిగింది.

 

ఆ అపారమైన ప్రేమలో భాగంగానే కంటికి రెప్పలా చూసుకునే ఆ మూగజీవుల మొత్తం లో బుధవారం ఓ పసువు బర్త్డే కార్యక్రమాన్ని ఆ రైతు ఘనంగా నిర్వహించడంతో గ్రామస్తులందరు ఆశ్చర్యానికి గురైయ్యారు.

 

ఆ రైతు పేరు చంద్రశేఖర్ గా బుధవారం మనసాక్షి పత్రిక గుర్తించింది. పశువులను అపారమైన ప్రేమతో కంటికి రెప్పలా చూసుకుంటున్న రైతుతో బుధవారం మనసాక్షి పత్రిక పశువుల బాగోగులకై ఆ రైతు పడుతున్న శ్రమను గుర్తించి అడిగి తెలుసుకోవడం జరిగింది.