Breaking Newsతెలంగాణరాజకీయం
BRS : జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ లో కీలక పదవి.. వేదికపై ప్రకటించిన కేసీఆర్..!
మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డి ఆదివారం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన వెంటనే ఆయనకు కీలక పదవి ప్రకటించారు.

BRS : జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ లో కీలక పదవి.. వేదికపై ప్రకటించిన కేసీఆర్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డి ఆదివారం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన వెంటనే ఆయనకు కీలక పదవి ప్రకటించారు. పార్టీలో చేరిన వెంటనే వేదికపై నుంచే ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవన్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. జీవన్ రెడ్డి సేవలు పార్టీకి ఎంతో అవసరం ఉందని, ఆయన రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. జగిత్యాలలో స్థానిక నేతలు సరిపోతారని, జీవన్ రెడ్డి మాత్రం కేవలం జగిత్యాల కే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో పార్టీని బలోపేతం చేయడానికి తనతో పాటు ఉంటారని కెసిఆర్ ప్రకటించారు.









