Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యవసాయం

Thummala : తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. రైతు భరోసాపై తుమ్మల కీలక ప్రకటన..!

Thummala : తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. రైతు భరోసాపై తుమ్మల కీలక ప్రకటన..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా :

తెలంగాణలో ఇప్పుడో సైలెంట్ రివల్యూషన్ నడుస్తోంది. దీని ఫలితాలను మనం త్వరలోనే చూస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ విప్లవం ఎప్పుడో మొదలైంది. అక్కడి రైతులు చాలా దూరం వెళ్లిపోయారు. తెలంగాణ రైతులు ఇప్పుడే అడుగులు ప్రారంభించారు. అదే ఆయిల్ పామ్ సాగు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విప్లవాన్ని బలంగా రైతుల చెంతకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. గత 9 నెలలుగా ఆయన ఈ అంశంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కారణం ఏంటంటే.. ఆయిల్ పామ్ సాగు వల్ల మంచి లాభాలు వస్తాయని ఆయనకు తెలుసు. పైగా ఈమధ్య కేంద్రం.. వంట నూనెల దిగుమతులపై సుంకాలు పెంచింది. అందువల్ల దేశీయంగా వచ్చే ఆయిల్ పామ్‌ కొనుగోళ్లకు కంపెనీలు ఆసక్తి చూపుతాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తాజాగా మంత్రి తుమ్మల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకం అమలు చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అలాగే.. తల తాకట్టు పెట్టి అయినా పంటల బీమా పథకం అమలు చేస్తామని అన్నారు. అశ్వారావుపేట ఆయిల్ ఫ్యాక్టరీలో మెగా పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఆయన… పామాయిల్ పంటకు టన్నుకు రూ.20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ పామాయిల్ మొక్క అందేలా చేస్తానన్నారు.

మంత్రి చెప్పిన ప్రతి మాటా రైతులకు మేలు చేసేదే. రైతు భరోసా వస్తే.. ప్రతీ రైతుకూ, ప్రతీ కౌలు రైతుకూ ఎకరానికి రూ.15,000 వస్తుంది. అలాగే రైతు కూలీకి రూ.12,000 వస్తుంది. ఇంకా పంటల బీమా వల్ల.. పంటలు దెబ్బతింటే.. బీమా పరిహారం వస్తుంది. దాని వల్ల రైతులు నష్టపోరు. అలాగే.. పామాయిల్‌కి టన్నుకి 20వేలు వస్తే, రైతులకు మంచి లాభాలు దక్కుతాయి. పామాయిల్ మొక్కలను ప్రభుత్వం రాయుతి పై ఇవ్వడం, డ్రిప్, యాజమాన్యం పద్ధతుల నిమిత్తం ఎకరాకు 4200/- నగదు బదిలీ చేస్తున్నారు కావునా రైతులు ఈ పంట వేసేందుకు ఆసక్తి చూపాలని తద్వారా మంచి అభివృద్ధి సాధించ వచ్చు అన్నారు.

ఏపీలో రైతులు ఎలా ముందుకెళ్లారంటే.. వారు పామాయిల్ తోటల్లో.. అంతర పంటగా కోకోను పండిస్తున్నారు. కోకో అనేది చాక్లెట్లు, స్వీట్లు, ఐస్‌క్రీమ్స్, డ్రింక్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు కాబట్టి దానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దాంతో అక్కడి రైతులు పామాయిల్‌తోపాటూ.. కోకో పంటతో కూడా లాభాలు పొందుతున్నారు. ఐతే.. తెలంగాణలో ఇప్పుడే ఈ విప్లవం మొదలైంది కాబట్టి… భవిష్యత్తులో ఇక్కడా ఇలాంటి వేరే ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ దిశగా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు