TG News : తెలంగాణలో మరో పరువు హత్య..!
TG News : తెలంగాణలో మరో పరువు హత్య..!
మన సాక్షి, పెద్దపల్లి :
తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. తన కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో కిరాతకంగా తండ్రి నరికి చంపాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిడి తోట గ్రామంలో చోటు చేసుకుంది.
మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరి కులాలు వేరు వేరు కావడంతో యువతి తండ్రి ప్రేమకు అడ్డు చెప్పాడు. ఇకనుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయికుమార్ ను కూడా హెచ్చరించాడు. కానీ అమ్మాయి.. అబ్బాయి ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉండడంతో యువతి తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి పది గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో మాట్లాడుతుండగా ఆ సమయంలో యువతి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణ రహితంగా సాయికుమార్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
అతని స్నేహితులు కుటుంబ సభ్యులు సాయికుమార్ ను హుటా హుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యం అందిస్తుండగానే సాయికుమార్ మృతి చెందాడు. అతడి పుట్టినరోజు నాడే హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
MOST READ :
-
District collector : విద్యార్థుల నైపుణ్య ప్రదర్శన బేష్.. జిల్లా కలెక్టర్ అభినందన..!
-
Nalgonda : ఎస్సి, ఎస్టీ కేసులో సంచలనం.. ముగ్గురికి జైలు శిక్ష..!
-
Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!
-
Nalgonda : ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు.. కామాంధుడికి 27 ఏళ్ల జైలు శిక్ష..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!









