Runamafi : రుణమాఫీపై మరో కీలక ప్రకటన.. వారి కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్..!
Runamafi : రుణమాఫీపై మరో కీలక ప్రకటన.. వారి కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రుణమాఫీ పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రుణమాఫీ కార్యక్రమం చేపడుతుంది. ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీని చేయగా మూడో విడత రుణమాఫీని ఆగస్టు 15వ తేదీన చేయనున్నారు.
జూలై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతుల 11.50 లక్షల కుటుంబాల ఉండాలని మాఫీ చేయగా జూలై 30వ తేదీన లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న ఏడు లక్షల రైతుల రుణాలు మాఫీ చేశారు.
కాగా ఆగస్టు 15వ తేదీన 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయనున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీ చేసినప్పటికీ చాలామంది రైతులు రుణమాఫీ కాలేదని ఆందోళన చెందుతున్నారు. వారికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల వద్ద సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరించారు.
వారికి ఆధార్ కార్డులో, పట్టాదారు పాస్ బుక్ లలో ,బ్యాంక్ అకౌంట్ లో తప్పుడుగా నమోదు కావడం వల్ల రుణమాఫీ కాలేదని గుర్తించారు. అందుకోసం గాను ప్రభుత్వం రుణమాఫీ కానీ రైతులందరికీ కోసం మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
సాంకేతిక కారణాల కారణంగానే అందరి రైతులకు రుణమాఫీ అందలేదు. రుణమాఫీ కానీ రైతుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి కూడా రుణమాఫీ అందకుంటే వారికోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాఫీ చేస్తామని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు.
ఆధార్ కార్డు పడ్డదారు పాసుబుక్ లలో పేర్లు మార్పులు కుటుంబ సభ్యుల మధ్య పంపకాల వ్యవహారం ఉండడం వల్ల రుణమాఫీ అందలేదని.. స్పెషల్ డ్రైవ్ లో ఇవన్నీ గుర్తించి వాటిని పరిష్కరించి రుణమాఫీ అందజేయనున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు.
ALSO READ :
మిర్యాలగూడ : ఆవిష్కరణకు సిద్ధమైన 100 అడుగుల జాతీయ జెండా..!
Narayanpet : పేటలో బంద్ సంపూర్ణం.. తెరుచుకోని దుకాణాలు, మూతపడిన విద్యా సంస్థలు..!










