TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా పై మరో కీలక నిర్ణయం.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా పై మరో కీలక నిర్ణయం.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులు ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. రైతుబంధు మాదిరిగా కాకుండా రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది.

రైతుల సంక్షేమం కోసం సంక్రాంతి నుంచి ప్రారంభించబోయే రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రైతు భరోసా అమలు చేసేందుకు విధి విధానాల రూపకల్పన పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యింది. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ నియమించారు.

సమావేశానికి భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు భేటీ అయ్యార. రైతు భరోసా విధివిధానాలపై సుమారు రెండు గంటల పాటు చర్చ కొనసాగింది.

రైతు భరోసా అమలుపై నియమ నిబంధనలపై చర్చ సాగింది. ఇన్కమ్ టాక్స్ చెల్లించే రైతులు, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా కు అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో రైతు భరోసా అమలుపై నిర్ణయం ఖరారు కాలేదు. దాంతో మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

MOST READ :

మరిన్ని వార్తలు