Breaking Newsజాతీయంటెక్నాలజీ

PSLV : శ్రీహరికోటలోని షార్ నుంచి రేపు మరో ప్రయోగం.. నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్..!

PSLV : శ్రీహరికోటలోని షార్ నుంచి రేపు మరో ప్రయోగం.. నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్..!

రాత్రి 8. 58గంటలకు మెుదలుకానున్న కౌంట్ డౌన్

నానో శాటిలైట్లను కక్ష్యలోని పంపనున్న ఇస్రో

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి… రేపు పీఎస్‌ఎల్‌వీ- సీ60 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ఈ రోజు రాత్రి 8 గంటల 58 నిమిషాలకు సైంటిస్టులు కౌంట్‌డౌన్‌ మొదలుపెడతారు. 25 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత సోమవారం రాత్రి 9 గంటల 58నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనున్నారు.

ఈ వాహక నౌక ద్వారా స్పాడెక్స్‌ జంట ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. అయితే ప్రయోగం సందర్భంగా నేడు శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు