Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!

Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!
ధర్మారం, మన సాక్షి :
కాలేశ్వరం జోన్ లో గల అసిఫాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాలలోని 25 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, బాలురు జూనియర్ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయుటకు తాత్కాలిక పద్ధతిన బోధన సిబ్బంది ఎంపిక కొరకై అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు పెద్దపల్లి డిస్టిక్ కోఆర్డినేటర్ ఎస్.కె దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.
కాలేశ్వరం జోన్ పరిధిలో ఉన్న కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలోని సైన్స్, ఆర్ట్స్ కళాశాలలో గల ఖాళీల మేరకు తాత్కాలిక పద్ధతిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ (లాంగ్వేజెస్) జూనియర్ లెక్చరర్ పిజిటి, టిజిటి హెల్త్ సూపర్వైజర్, పిఈటి, పీడీల ఎంపిక కొరకు ఈ నెల 29న కోర్ సబ్జెక్టు లైనా మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, లైబ్రేరియన్ వంటి సబ్జెక్టులకు ఈనెల 30న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల బాలురు జైపూర్,మంచిర్యాల, జిల్లాలలో నిర్వహిస్తారు.
ములుగు భూపాలపల్లి జిల్లాల పరిధిలో గల కాళీలకు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల బాలురు, జాకారం ,ములుగు జిల్లా నందు ఉదయం 9 గంటల నుండి పాఠ్యాంశ బోధన డెమోలు నిర్వహించబడునని కాలేశ్వరం జోన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఎస్ కే దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్హతలు జూనియర్ లెక్చరర్, పిజిటి పోస్టులకు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50 మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ తో పాటు బీఈడీ తర్వాత టీజీటీ పోస్టుకు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ, బిఎ, బీకాం డిగ్రీ కనీసం 50 మార్కులతో పాటు బీఈడీ అర్హత కలిగి ఉండాలి. పి ఈ టి/పిడి పోస్టుల కొరకు యూజీడి, పిఈడి,/ఎంపిఈడి, అర్హత కలిగి 50 శాతం మార్కులకు తగ్గకుండా ఉండాలి.
హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు జనరల్ నర్సింగ్ మిడ్ వై ఫర్లి (జి ఎన్ ఎం) లేదా బిఎస్సి నర్సింగ్ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కలిగి ఉండాలి. రెసిడెన్షియల్ విద్యా బోధన పట్ల అవగాహన ఆసక్తి గల అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న ఏదైనా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఈ నెల 24 నుండి 27 వరకు తమ పూర్తి బయోడేటా తో పాటు ధ్రువపత్రాల జిరాక్స్ కాపీల సెట్లను జతపరిచి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
నిర్దేశించబడిన తేదీలలో నిర్దేశించబడిన కళాశాలల యందు డెమో కొరకు అటెండ్ అయ్యే అభ్యర్థులు తమ విద్యార్హతలను తెలిపే ఒరిజినల్ సర్టిఫికెట్లను ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకొని సకాలంలో హాజరుకావాలి. బాలికల విద్యాలయంలో పనిచేయడానికి స్త్రీ అభ్యర్థులు మాత్రమే అర్హులని డిస్టిక్ కోఆర్డినేటర్ ఎస్ కె దేవసేన టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ సొసైటీ మల్లాపూర్, కాలేశ్వరం జోన్ వన్ తెలిపారు.
MOST READ :
-
District Collector : ప్రకృతి వ్యవసాయము పట్ల రైతులను ప్రోత్సహించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!
-
WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!
-
WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!









