Doctorate : ఆరెగూడం వాసికి ఓయు డాక్టరేట్.. గ్రామస్తులు హర్షం..!
Doctorate : ఆరెగూడం వాసికి ఓయు డాక్టరేట్.. గ్రామస్తులు హర్షం..!
గుర్రంపోడు, మన సాక్షి :
నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన పులకరం విష్ణు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరెట్ పట్టా పొందాడు.
అంజయ్య -అంజమ్మ దంపతుల కుమారుడైన విష్ణుకి ప్రొఫెసర్ నర్సింగ్ రావు పర్యవేక్షణలో జియోలాజికల్, జియోఫిజికల్ అండ్ జియోకెమికల్ స్టడీస్ ఎవాల్యూయేట్ గ్రౌండ్ వాటర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ అండ్ అరౌండ్ అవుటర్ రింగ్ రోడ్,గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ స్టేట్, ఇండియా అనే అంశంపై పరిశోధనలు చేసి గ్రంథాన్ని సమర్పించినందుకు గాను ఉస్మానియా యూనివర్సిటి డెకరేట్ అవార్డును ప్రకటించింది.
ఆయన విధ్యాభ్యాసం కొప్పోల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసించాలన్న పట్టుదలతో ఇంటర్,డిగ్రీ పూర్తిచేసి ఎమ్మెస్సి మరియు పిహెచ్డి జియాలజి డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసారు.
భూగర్భశాస్త్రం పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న ఆసక్తి ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటి నుండి డాక్టరేట్ పట్టాను అందుకునేలా చేసిందని ఆయన అన్నారు.అదేవిధంగా స్వతహాగా ‘జియో జల్ జీవన్’ అనే సంస్థను అతను స్వాపించాడు.
ఈ సంస్థ ద్వార వాటర్ షెడ్ లక్షణాలు, నీటి నిర్వాహణ ప్రణాళికలు, భూగర్భజల స్థాయిలను పెంచడానికి ఆదర్శవంతమైన రీచార్జ్ ప్రణాళికలు, బావులు లేదా బోరు బావులు తవ్వడానికి అనువైన ప్రదేశాలను సూచించడం అనేది ఈ సంస్థ ద్వారా చేస్తున్నట్లు ఆయన అన్నారు. డాక్టరేట్ పట్టా పొందిన విష్ణును ప్రొఫెసర్లు, మిత్రులు, గ్రామస్తులు అభినందించారు.
MOST READ :
-
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!
-
Karimnagar : లీజు రద్దు చేయాలి.. దేవాలయ భూములను కాకాపాడాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!
-
Open University : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్.. ధరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడంటే..!
-
TG News : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిల ఎంపిక..!









