Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

సాయధ పోరాట యోధుడు పోరెల్ల దాస్ వర్ధంతి..! 

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మెయిన్ రోడ్డు పై కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు వీర తెలంగాణ విప్లవ యోధులు, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ సీనియర్ స్వాతంత్ర సమరయోధులు పోరెల్ల దాసు ఎనిమిదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.

సాయధ పోరాట యోధుడు పోరెల్ల దాస్ వర్ధంతి..! 

తుంగతుర్తి మన సాక్షి :

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మెయిన్ రోడ్డు పై కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు వీర తెలంగాణ విప్లవ యోధులు, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ సీనియర్ స్వాతంత్ర సమరయోధులు పోరెల్ల దాసు ఎనిమిదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి జోహార్లు అర్పించిన సీనియర్ కమ్యూనిస్టు మార్క్సిస్టు నాయకులు కేడియం లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అల్పైన పోరాటం చేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా కొనియాడారు .అతడు 1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలకు తెగించి తన యవ్వన జీవితమంతా పేద ప్రజలకు ధారబోసిన వ్యక్తి ఏకైక వ్యక్తిగా కొనియాడారు.

సిపిఎం సీనియర్ నాయకులు కడెం లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి వెట్టిచాకిరి నుండి పేద ప్రజలకు విముక్తి కలిగించిన పోరాట యోధుడు కోరేళ్ళ దాస్ అని కొనియాడారు. తిరుమలగిరి మండల పరిధిలోని తొండ గ్రామంలో పోరెళ్ల దాసు 25 సంవత్సరాలు సర్పంచ్ గా మరో ఆరు సంవత్సరాలు తిరుమలగిరి మండల పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికై ప్రజాసేవకే అంకితమైన నికాసైన జననాయకుడు నిస్వార్థ జీవి అని ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు కొత్తగట్టు మల్లయ్య సిపిఎం సీనియర్ నాయకులు ఆకుల సోమయ్య, బూర్గుల ప్రభాకర్ , మండల నాయకులు లక్ష్మీ, ఎం సి బి ఎఫ్ శ్రీనివాస్, నాగార్జున, కోరెళ్ళ లక్ష్మయ్య పలువురు పలు గ్రామాల సిపిఎం సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు