Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి, తాను ఆత్మహత్యాయత్నం..!

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపూర్ లో ఈ ఘటన జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి, తాను ఆత్మహత్యాయత్నం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపూర్ లో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికు తెలిపిన వివరాల ప్రకారం నరేందర్ రెడ్డి, నీలిమ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన నీలిమ పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో
14 సంవత్సరాల కుమార్తె కృతి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా 11 సంవత్సరాల కుమారుడు అశాంత్ రెడ్డి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

కుమార్తె ప్రాణాలు కోల్పోగా గాయపడిన కుమారుడుని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తనను తాను గాయపరచుకొని ఆత్మహత్యాయత్నానికి నీలిమ పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కృతి రెడ్డి మృతదేహాన్ని స్థానిక భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు