Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ.. పోలీసులపై కాల్పులు..!

హైదరాబాదులోని మొయినాబాద్ లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది.

Hyderabad : మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ.. పోలీసులపై కాల్పులు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

హైదరాబాదులోని మొయినాబాద్ లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఆయన ఫామ్ హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈగల్ టీం పోలీసులు 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి తో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా ఉన్నట్లు సమాచారం. పార్టీలో పాల్గొన్న తొమ్మిది మంది పురుషులతో పాటు ఒక మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని, వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు.

ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు నెగటివ్ రాగ పైలట్ రోహిత్ రెడ్డి సహా ఐదుగురికి కొకెన్ పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి తో పాటు నమిత మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి గా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని ఇతర టెస్టుల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ఫామ్ హౌస్ కు వెళ్ళిన పోలీసులపై ఒక వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తిపై ఆర్మ్ డ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. కాల్పులకు ఉపయోగించిన గన్ తో పాటు బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన లైసెన్స్ గన్ ను కూడా గుర్తించారు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ లో దొరికిన వారిని ఎర్రగడ్డ హాస్పటల్ లో బ్లడ్ షాంపిల్స్ సేకరణ అనంతరం రోహిత్ రెడ్డి తో పాటు మిగతా వారిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరిన్ని వార్తలు