Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురంగారెడ్డిరాజకీయం

పెంచిన గ్యాస్ ధరల పెంపుపై నిరసన..!

శంకర్‌పల్లి మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తాలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల పెంపుపై మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేశారు.

పెంచిన గ్యాస్ ధరల పెంపుపై నిరసన..!

శంకర్‌పల్లి (మన సాక్షి):

శంకర్‌పల్లి మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తాలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల పెంపుపై మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొని అనంతరం మాట్లాడారు. యుద్ధ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

యుద్ధాన్ని కారణంగా చూపుతూ వంట గ్యాస్ ధరలను పెంచడం సామాన్య ప్రజలపై మరింత భారాన్ని మోపడం అవుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపుతూ గృహ అవసరాల గ్యాస్ పై రూ.60, కమర్షియల్ గ్యాస్ పై రూ.114 పెంచడం ప్రజలకు అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ధరల పెంపుతో ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందని విమర్శించారు. వెంటనే వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకుని ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధానికి దిగడం తగదని ఆయన అన్నారు.

యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కావని, శాంతి చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. యుద్ధాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత నెలకొని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్, మైలారం రాజు, సత్యనారాయణ, శ్రీను,
శశేoదర్ రెడ్డి వెంకటేష్, నవీన్, శశికాంత్, ఎజాస్, వెంకటేష్ గౌడ్ ఉన్నారు.

మరిన్ని వార్తలు