Suryapet : వికాస్ ఫార్మసీ కళాశాలలో డ్రగ్స్ నివారణ పై అవగాహణ..!
Suryapet : వికాస్ ఫార్మసీ కళాశాలలో డ్రగ్స్ నివారణ పై అవగాహణ..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని రాయినిగూడెం వికాస్ ఫార్మసీ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. దీనిలో భాగంగా కళాశాలలో వివిధ రకములైన పోటీలు నిర్వహించి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రకటించారు.
ఈ బహుమతులు జూన్ 25న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో మెడల్,సర్టిఫికెట్ అందజేస్తరూ.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నీల మాట్లాడుతూ డ్రగ్స్ విషం కన్నా ప్రమాదమైనదని యువత డ్రగ్స్ కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా డ్రగ్స్ నివారణకు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇట్టి కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పెద్దింటి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ స్వరూప, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ నటేష్, మహేష్, ప్రీతం కుమార్, సుజాత, భవాని, డా.తులసి, ఫర్హిన్ పరిపాలనాధికారి దేవులపల్లి వినయ్ కుమార్ మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.









