Suryapet : అయ్యప్ప మాల ధారణ స్వాములకు ముస్లిం మైనార్టీ యువకుడి అన్నదానం..!
Suryapet : అయ్యప్ప మాల ధారణ స్వాములకు ముస్లిం మైనార్టీ యువకుడి అన్నదానం..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా మైనార్టీ కాంగ్రెస్ నాయకులు ఎస్ కె. ఫారుక్ వివిధ మాల ధారణ స్వాములు సుమారు 1000 మందికి అన్నదానం చేసి మతసామరస్యాన్ని చాటారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శబరి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు ఎస్కే ఫారూఖ్ శనివారం మాల ధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష సందర్భంగా మాలధారణ స్వాములకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. అయ్యప్ప స్వాముల దీక్షలు ఫలించి అందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ పామరు స్వామి రూపంలో మైనార్టీ నాయకుడు ఫారుక్ మాలధారణ స్వాములకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.
మతాలతో పని లేకుండా అయ్యప్ప దీక్ష ధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని చేసిన ఫారూఖ్ కు మాలధారణ స్వాములు, దేవాలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు రెంటాల సతీష్ శర్మ, కమిటీ సభ్యులు బెలీదే శ్రీనివాస్ , గొట్టి ముక్కల శ్రీనివాస్ రెడ్డి, నరేంద్రుని విద్య సాగర్, బూర రాములు, జటంగి రవి, నాగయ్య, సాయి, సిద్దు, శ్రీనివాస్, మల్లేష్, గణేష్, మురళి, మహేష్, జిశాన్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Hyderabad : మద్యం మత్తులో వాహనం డ్రైవింగ్.. ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పు..!
-
District collector : స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లా కలెక్టర్..!
-
Nalgonda : ఈ ముఠా మామూలుది కాదు.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!
-
TG News : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా పై సీఎం రేవంత్ ఆదేశాలు..!









