TOP STORIESBreaking Newsసినిమా

Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

మన సాక్షి, హైదరాబాద్ :

హీరో ప్రభాస్ ను బాహుబలి ఏ రేంజ్ లోకి తీసుకెళ్లిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా బాహుబలి అంటేనే తెలుగు ప్రజలందరికీ ప్రభాస్ గుర్తొచ్చేలా ఉంటుంది. అయితే ఇక కల్కి 2898 అనే సినిమా ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు. రూ.1100 కోట్ల వసూలు చేసి ఇండియన్ సినిమాలో రికార్డు సృష్టించింది. రూ. 1000 కోట్లు వసూలు చేసిన టాప్ త్రీ హీరోస్ లలో ప్రభాస్ నిలిచారు.

అయితే హైదరాబాదులోని గచ్చిబౌలిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కృష్ణంరాజు, ప్రభాస్ రామ్ గోపాల్ వర్మ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోలేమని, అదే విధంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సత్తా చాటాడని, ఆయన తనకు మంచి మిత్రుడు అని చెప్పారు. ఇంకా బాహుబలి చిత్రం గురించి మాట్లాడుతూ బాలీవుడ్ ను దాటి మన టాలీవుడ్, హాలీవుడ్ తో పోటీపడి రాణించిన చిత్రం బాహుబలి అని, దానికి ప్రభాసే కారణమని పేర్కొన్నారు.

తెలుగు సినిమా రేంజ్ ను పెంచిన సినిమా బాహుబలి.. ఆ సినిమాలో ప్రభాస్ లేకుండా ఆ చిత్రాన్ని కూడా ఊహించుకోలేమని రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దీనంతటికీ కూడా ఆ సినిమా యూనిట్ పడిన కఠోర శ్రమ కష్టపడే తత్వమే అంటూ ఆయన పేర్కొన్నారు.

ALSO READ : 

Runamafi : రుణమాఫీ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇవీ..!

Grama Panchayathi : గ్రామపంచాయతీ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. మంత్రి పొన్నం వెల్లడి..!

Dharani : కాసుల పంట.. ధరణి పెండింగ్ కేసులు..!

Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు