Bajaj Allianz: బజాజ్ అలయన్జ్ పాలసీదారులకు అదిరే శుభవార్త.. రికార్డు స్థాయిలో రూ. 1,833 కోట్ల బోనస్..!

Bajaj Allianz: బజాజ్ అలయన్జ్ పాలసీదారులకు అదిరే శుభవార్త.. రికార్డు స్థాయిలో రూ. 1,833 కోట్ల బోనస్..!
ముంబయి, మన సాక్షి
బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ పాలసీదారులకు భారీ శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ. 1,833 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అధికం. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇచ్చిన రూ. 1,383 కోట్లతో పోలిస్తే ఈసారి బోనస్ 32 శాతం పెరిగింది. ఈ బోనస్ వల్ల దాదాపు 11.71 లక్షల మంది పాలసీదారులు లబ్ధి పొందనున్నారు.
బజాజ్ అలయన్జ్ లైఫ్ గత 24 ఏళ్లుగా ప్రతి సంవత్సరం బోనస్ ప్రకటిస్తూ తమ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. ఈసారి ప్రకటించిన బోనస్ 2025 మార్చి 31 నాటికి అమల్లో ఉన్న పాలసీలకు వర్తిస్తుంది. కంపెనీ తమ లాభాల నుంచి ఈ మొత్తాన్ని పంచుతోంది.
బజాజ్ అలయన్జ్ లైఫ్ ఏస్, బజాజ్ అలయన్జ్ లైఫ్ ఏస్ అడ్వాంటేజ్, బజాజ్ అలయన్జ్ లైఫ్ ఎలీట్ అష్యూర్ వంటి పాలసీలు కంపెనీ అందిస్తోంది. ఈ సందర్భంగా బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 1,833 కోట్ల బోనస్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తమ తెలివైన పెట్టుబడి విధానాలు, బలమైన ఆర్థిక స్థితే దీనికి కారణమన్నారు. కస్టమర్లే ముఖ్యమని భావించే సంస్థగా, వారి జీవిత లక్ష్యాలు నెరవేరడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రకటించే ఈ బోనస్‌లు పాలసీ మెచ్యూర్ అయినప్పుడు లేదా పాలసీ నుంచి వైదొలిగినప్పుడు పాలసీదారులకు అందిస్తారు. కొన్ని పాలసీల్లో అయితే ప్రతి సంవత్సరం లేదా పాలసీ నిబంధనల ప్రకారం నగదు రూపంలో కూడా ఇస్తారు.
By : Vishal, ManaSakshi
MOST READ NEWS :
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!
-
Hair Fall : పురుషులకే బట్టతల ఎందుకు.. నివారణకు సూచనలు..!
-
Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!









