జనగాంలో ఘనంగా బక్రీద్ వేడుకలు..!
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు గురువారం సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.

జనగాంలో ఘనంగా బక్రీద్ వేడుకలు..!
పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి రజాక్
సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి:
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు గురువారం సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించారు. పండుగ సందర్భంగా కొత్త బట్టలు ధరించి స్థానిక ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ప్రార్థనల అనంతరం ఒకరి నొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ రజాక్ మాట్లాడుతూ సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.త్యాగానికి, భక్తికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే పండుగ బక్రీద్ పండుగ అన్నారు.
శాంతి, సామరస్యం, మరియు సోదర భావాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. గోవధ నీ నిషేధించాలని, హిందూ సోదరుల మనోభావాలనీ వారి విశ్వాసాలని, గౌరవించాలనీ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ వేడుకలలో తుర్క కాశ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బడేసాబ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ కైసర్, ఈద్గా కమిటీ ఛైర్మెన్ మహ్మద్ కాలేక్, మజీద్ కమిటీ సదర్ మహ్మద్ మునీర్, నాయకులు ఉస్మాన్, ఏజాస్, భువనగిరి ఫేరోజ్, కరీం, అజీమ్, ఖాసిం, చాంద్ మియా, మౌలానా తదితరులు పాల్గొన్నారు.









