బలగం : గ్లోబల్ రేంజ్ లో దూసుకుపోతుందా.. ఎన్ని అవార్డులు వచ్చాయో ..?

బలగం : గ్లోబల్ రేంజ్ లో దూసుకుపోతుందా.. ఎన్ని అవార్డులు వచ్చాయో ..?

మనసాక్షి డెస్క్ :

బలగం సినిమా చిన్న సినిమాగా తెరకెక్కింది. ఇప్పుడు అది ప్రతి పల్లెలో ఊరు ఊరంతా కలిసి చూసేస్తాయికి వెళ్ళింది. ఇటీవల కాలంలో ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్లి కూడా చూసే పరిస్థితి లేదు. అందుకుగాను పెద్దపెద్ద సినిమాలే ఓటీడీలో విడుదల చేస్తున్నారు. అలాంటి సమయంలో ఓ చిన్న సినిమాగా తెరకెక్కిన బలగం ఇప్పుడు గ్రామాలలో ఊరం ఊరంతా కలిసి చూసే స్థాయికి వెళ్ళింది. ఈ సినిమా మొత్తం కుటుంబ చిత్రం. కుటుంబం కలిసి ఉండాలనే యదార్ద సంగటనలు పల్లె ప్రజలను ఆకట్టుకున్నాయి.

 

నిన్న మొన్నటి వరకు త్రిబుల్ ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డును సాధించిన తెలుగు సినిమాగా ఉంది. త్రిబుల్ ఆర్ ఓ రేంజ్ లో ఆ సినిమాకు ప్రజలు పట్టం కట్టారు. అందుకే దానికి ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఇప్పుడు బలగం నేమ్ తో అంతర్జాతీయ స్థాయిలో కూడా అదే పేరు కంటిన్యూ అవుతుందని చెప్పనక్కర్లేదు.

 

గ్లోబల్ రేంజ్ లో బలగం సినిమా దూసుకుపోతుంది. ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డును సొంతం చేసుకుంటుంది. ఇప్పటి వరకు బలగం సినిమాకు పలు విభాగాలలో ఏకంగా 40 ఇంటర్నేషనల్ అవార్డులు లభించాయి. బలగం ఇప్పుడు గ్లోబల్ సినిమాగా మారుతుంది. ప్రపంచమంతా చిన్న సినిమాకే జేజేలు కొడుతున్నారు. జబర్దస్త్ ఫేమ్ వేణు వెల్దంది డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాగా తనకెక్కిన బలగం ఇప్పుడు పెద్ద సినిమాగా గ్లోబల్ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పనక్కరలేదు.