Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

TG News : మురుగుకాలవలో బ్యాలెట్ పత్రాలు.. జిల్లా కలెక్టర్ చర్యలు..!

TG News : మురుగుకాలవలో బ్యాలెట్ పత్రాలు.. జిల్లా కలెక్టర్ చర్యలు..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో తొలి విడుత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు మురుగు కాలువలో దర్శనమిచ్చాయి. ఈ సంఘటన తీవ్ర గందరగోళానికి చోటుచేసుకుంది. ఆ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థిపై 455 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దాంతో రిగ్గింగ్ జరిగిందంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రుద్రారపు భిక్షం ఆరోపించారు.

ఇదిలా ఉండగా మురుగు కాలువలో దొరికిన బ్యాలెట్ పేపర్లన్నీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుకు వేసినవే అంటూ బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బ్యాలెట్ పత్రాలతో సహా జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. కాగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ విషయంపై స్టేజ్ 2 ఆర్ వో ను సస్పెండ్ చేశారు.

మరిన్ని వార్తలు