Bandi Sanjay : పంచాయతీ ఎన్నికల నేపథ్యం.. గ్రామాల అభివృద్ధికి బండి సంజయ్ బంపర్ ఆఫర్..!

Bandi Sanjay : పంచాయతీ ఎన్నికల నేపథ్యం.. గ్రామాల అభివృద్ధికి బండి సంజయ్ బంపర్ ఆఫర్..!
కరీంనగర్, మన సాక్షి :
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామాభివ్రుద్ది కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులను అందజేస్తానని కేంద్ర మంత్రి ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివ్రుద్ధి వైపు ద్రుష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రోత్సాహక నిధులిస్తామని హామీ ఇవ్వడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 70 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేశారన్నారు.
కానీ ఐదేళ్లయినా ఆయా గ్రామాలకు కేసీఆర్ ప్రభుత్వం నయాపైసా ఇవ్వకుండా మొండి చేయి చూపిందని హెద్దెవా చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏకగ్రీవం పేరుతో నజరానా ప్రకటించి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల మాటలు నమ్మి ఏకగ్రీవం చేసిన పంచాయతీల ప్రజలు ఆర్ధికంగా నష్టపోయారన్నారు.
ఆయా గ్రామాల్లో అభివ్రుద్ది పూర్తిగా కుంటుపడిందన్నారు. దయచేసి ఈ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ఆ రెండు పార్టీలు మళ్లీ ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయన్నారు. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే తప్పదని, బండి సంజయ్ ఎన్నడూ చేసేదే చెబుతాడని, చెప్పేదే చేస్తాడని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులుగా ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తానని మాట ఇస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇయ్యలేదని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవన్నారు. నన్ను కోసినా నయాపైసా రాదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.
MOST READ :
-
Karimnagar : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల అవగాహనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
-
Devarakonda : గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..!
-
Ministers WhatsApp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూప్ హ్యాక్..!
-
Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!









