TOP STORIESBreaking Newsహైదరాబాద్

Bank Holidays : మే నెలలో బ్యాంకులకు సెలవులే.. సెలవులు.. ఎన్ని రోజులంటే..!

Bank Holidays : మే నెలలో బ్యాంకులకు సెలవులే.. సెలవులు.. ఎన్ని రోజులంటే..!

మన సాక్షి :

మే నెల గురువారం నుండి ప్రారంభమైంది. వివిధ అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లేవారు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన వివరాల ప్రకారం.. శని, ఆదివారాలు, పండుగలు, పర్వదినాలు కలిపి మొత్తం ఏకంగా మే నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి. అయితే ఆర్బిఐ సెలవుల జాబితా ప్రకారం.. రాష్ట్రాల వారిగా వేరువేరుగా సెలవులు ఉంటాయి.

ప్రాంతీయ పండుగలు, జాతీయ పండుగలు రాష్ట్ర పండుగలు ఉండటం వల్ల మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే ఇక బ్యాంకులు మూసి ఉన్నా కూడా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ సేవలు నిరంతరంగా పనిచేయనున్నాయి. వాటి సహాయంతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది.

మే నెలలో సెలవుల వివరాలు :

  • మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు

  • మే 4 ఆదివారం

  • మే 5 రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా సెలవు

  • మే 10 రెండవ శనివారం

  • మే 11 ఆదివారం

  • మే 12 బుద్ధ పూర్ణిమ సందర్భంగా కర్ణాటకలో సెలవు ఉంటుంది. తెలంగాణలో ఆప్షనల్ హాలిడే ఉంటుంది.

  • మే 16 సిక్కిం స్టేట్ డే సందర్భంగా ఆ రాష్ట్రంలో సెలవు

  • 18 ఆదివారం

  • మే 24 నాలుగో శనివారం

  • మే 25 ఆదివారం

  • మే 26 కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు సందర్భంగా ప్రాంతీయ సెలవు

  • మే 29 మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాలలో సెలవులు ఉంటాయి.

  • మే 30 గురు అర్జున్ దేవ్ జి బలిదానం దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలలో బ్యాంకులకు ఆప్షనల్ హాలిడే ఉంటుంది.

MOST READ :

  1. Nalgonda : నల్గొండ జిల్లాలో వైద్యాధికారి సంచలన నిర్ణయం.. నాలుగు ఆసుపత్రులకు నోటీసులు..!

  2. Miryalaguda : సబ్ కలెక్టర్ సంచలన నిర్ణయం.. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!

  3. District collector : నీట్ పరీక్షకు అంతా సిద్ధం.. అభ్యర్థులు ఇవి వెంట తీసుకురావద్దు..!

  4. Breakfast: మంచి ఆహారమని బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తింటున్నారా.. అయితే చాలా ప్రమాదం..!

  5. Chicken: చికెన్ లేనిదే ముద్ద దిగట్లేదా.. అయితే ఇది తెలుసుకోవల్సిందే..!

మరిన్ని వార్తలు